కవిత్వం & కోట్స్

రాజన్న రాజ్యం  Song Lyrics

రాజన్న రాజ్యం  Song Lyrics

రాజన్న రాజ్యం 

రాజన్న రాజ్యం 

ఇది రాజన్న రాజ్యం, జగనన్న రాజ్యం

బంగారు రాజ్యం, భవితున్న రాజ్యం

నవరత్న రాజ్యం, కార్మికుల రాజ్యం

మనసున్న రాజ్యం, జగనన్న రాజ్యం //

వచ్చింది వచ్చింది రాజన్న రాజ్యము

జగనన్న బాటలో రాజ్యమే నడవాలి, రామరాజ్యమే నడవాలి

జగనన్న యిచ్చిన నవరత్న మాలికలు

ఇంకనూ వచ్చును శతసహస్ర పధకములు //

//ఇది రాజన్న రాజ్యం//

 

విద్యార్థుల భవితవ్యం లక్ష్యమే బాటగా

ఉద్యోగుల భవితమే సుఖశాంతుల దిశగా

దశ దిశలు చాటే మహిళా పథకములు

పాడి పంటలు రైతన్నలకు వరప్రదమాయే //

//ఇది రాజన్న రాజ్యం//

 

నీటిపథకములే కానీ, ప్రాజెక్టులే కానీ

వాణిజ్య పథకములే కానీ, ఇంటి సౌలభ్యములే కానీ

శాంతి భద్రతలే కానీ, సంప్రదాయములే కానీ

నిలబెట్టును జగనన్న, రాజన్న రాజ్యంలో //

//ఇది రాజన్న రాజ్యం//

రాజన్న రాజ్యము బంగారు రాజ్యము

బాధలను తొలగించె జగనన్న ప్రభుత్వము

మోసాలను అరికట్టే పోలీసు శాఖలు

దోపిడీలను అరికట్టే ప్రభుత్వాధి కారులు //

//ఇది రాజన్న రాజ్యం//

తాగుబోతు ఆగడాల తాటతీసే ప్రభుత్వము

దౌర్జన్య రాక్షసులను మట్టికరిపించె రక్షకులు

పందాల రాయుళ్లకు కళ్ళే ల బాటలు

కావాలి రాష్ట్రము రతనాల రాష్ట్రము //

// ఇది రాజన్న రాజ్యం//

జగన్ అంటే ఊపిరి, జగన్ అంటే ధైర్యము

సాహసాల బాటలో, క్రీడల పథకాలలో

ముందు చూపు దారిలో, పయనించు గుండె నిబ్బరంతో

మన రాష్ట్ర గౌరవం, మనదేరా గౌరవం //

// ఇది రాజన్న రాజ్యం//

మాటంటే మాటరా, జగన్ అంటే మాటరా

పూలబాట వేయరా, మనుగడ సాధించరా

ధైర్యానికి రూపము, రూప కల్ప రాష్ట్రము

ప్రగతిపధం బాటలో, నిండుమనసు తృప్తితో //

// ఇది రాజన్న రాజ్యం,//

శాంతముగ, సుఖ శాంతముగ నిదురపోండి

రాజన్న రాజ్యంలో, జగనన్న పాలనలో

మంత్రుల ఆదరణలో, భగవంతుని ఆశీస్సులతో

జీవించండి, బ్రతుకు బాటలో ఆదర్శంగా //

//ఇది రాజన్న రాజ్యం,//

 

నిత్యకల్యాణం పచ్చతోరణం

ప్రజల సుఖ శాంతులే రాజన్న రాజ్యాల్లో

కనీ వినీ ఎరుగని రీతిలో వేసే ప్రతీ అడుగు

జగనన్నను మునుముందుకు నడిపిద్దామ్ ప్రగతి పధంలో ముందుకు నడిపిద్దామ్ //

//ఇది రాజన్న రాజ్యం,//

==========

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.