లిరిక్స్

ఒకే ఒక జీవితం ‘అమ్మ’ సాంగ్ లిరిక్స్

అమ్మా!! వినమ్మా.. నేనాటి నీ లాలి పదన్నే
ఓ!! ఔనమ్మా.. నేనేమ్మా.. నువ్ ఏనాడో కనిపెంచిన స్వరాన్నే

మౌనమై ఇన్నాళ్లూ నిదరలోనే ఉన్నా..
గానమై ఈనాడే మేలుకున్నా..

నీ పాదాలకు మువ్వల్లా నా అడుగులు సాగాలమ్మా..
నీ పెదవుల చిరునవ్వుల్లా నా ఊపిరి వెలగాలమ్మా..

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా….
అణువణువు నీ కొలువే అమ్మా..

ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..

అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే

బెదురుపోవాలంటే నువ్వు కనిపించాలి
నిదరావాలంటే కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే నువ్వెతినిపించాలి
ప్రతి మెతుకు నా బతుకు అనిపించేలా..
నువ్వుంటేనే నేనూ..
నువ్వంటేనే నేనూ..
అనుకోలేకపోతే ఏమైపోతాను
నీ కడ చూపే నన్ను కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా

మరి మరి నునునువు మురిపెంగా చూస్తూ ఉంటే చాలమ్మా
పరిపరి విధముల గెలుపులుగా పైకెదుగుతు ఉంటానమ్మా..
అయినా సరే ఏనాటికీ ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలేంతగా ఎదగాలనుకోనే

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..
నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..

నిరంతరం నీ చంటిపాపల్లే ఉండాలినే నెన్నాళ్లకీ..

నిన్నొదిలేంతగ ఎదగాలనుకోనే అమ్మా….
అణువణువు నీ కొలువే అమ్మా..
ఎదసడిలో శ్రుతిలయలు నువే అమ్మా..
అమ్మా.. నే కొలిచే శారదవే
నను నిత్యం నడిపే సారధివే

Movie: OKE OKA JEEVITHAM
Song: Amma Song
Music: Jakes Bejoy
Singer: Sid Sriram
Lyrics: Sirivennela Seetharama Sastry

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.