ఎంటర్టైన్‌మెంట్

అనసూయ ఆంటీ ఐటెం సాంగ్ అట్టర్ ప్లాప్‌..

: జబర్దస్త్ అనసూయ ఐటెం సాంగ్ లకు కొత్త కాదు.. గతంలో పలు సినిమాల్లో ఐటం సాంగ్స్ చేసి సూపర్ హిట్లు అందుకోకున్నా కూడా ఒక మోస్తరు సక్సెస్ ని దక్కించుకున్నారు. అనసూయా ఇప్పుడు వాంటెడ్ పండుగాడ్‌ అనే సినిమాలో ఐటెం సాంగ్‌ చేసింది. ఆ ఐటెం సాంగ్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్‌ లో ఆ ఐటెం సాంగ్ ను ప్రేక్షకులు చూడవచ్చు. జబర్దస్త్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించగా దీపిక పిళ్లి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలో జబర్దస్త్ కామెడీ ఎంతో మంది కీలక పాత్రలో కనిపించారు.

ఈ సినిమాకు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పకుడిగా వ్యవహరించడం వల్ల అందరి దృష్టి ఆకర్షితమై అయింది. ఈ సినిమా లోని కొన్ని సన్నివేశాలను పాటలను కూడా ఆయన ప్రత్యేకంగా సూచించిన విధంగా చిత్రీకరించారని, దర్శకత్వ పర్యవేక్షణ కూడా ప్రచారం జరుగుతోంది. అనసూయ చేసిన ఐటమ్ సాంగ్ కి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేశాడంటూ సమాచారం అందుతుంది. అయినా కూడా ఈ పాట ఏ మాత్రం ఆకట్టుకోలేదు.

అనసూయ అందం కోసం ఈ పాటను చూసిన చాలా మంది పెదవి విరుస్తున్నారు. బాబోయ్‌ ఏమీ అందం అంటూ చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమె నడుము అందం గా లేదంటూ ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి బుల్లి తెర ముద్దుగమ్మ అనసూయ వెండి తెర సాంగ్‌ లో మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. సుడిగాలి సుదీర్ యొక్క సినిమా కు ఆమె ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది అని భావిస్తే ఆమె ప్రధానమైన మైనస్‌ అయ్యే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. సినిమా విడుదలైతే ఐటెం సాంగ్ యొక్క టాక్‌ ఏమైనా మారుతుందేమో చూడాలి.

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.