వార్తలు

దుబాయ్ నుంచి ఎంత బంగారం కొని తేవ‌చ్చు..?

దుబాయ్‌లో ఆదాయ‌పు ప‌న్ను మాత్ర‌మే కాదు, ఇత‌ర ఏ ప‌న్నులు కూడా ఉండ‌వు. అందుకనే అక్క‌డ అన్ని ర‌కాల వ్యాపారాలు చాలా బాగా సాగుతుంటాయి. ఇక వాటిల్లో బంగారం వ్యాపారం కూడా ఒక‌టి. అక్క‌డ అమ్మే బంగారం చాలా క్వాలిటీగా ఉంటుంద‌ని పేరుంది. దీనికి తోడు అక్క‌డ బంగారం రంగాన్ని ఎక్కువ‌గా ప్రోత్స‌హిస్తారు. కొన్ని ల‌క్ష‌ల కోట్ల వ్యాపారం సాగుతుంది. క‌నుక‌నే బంగారంపై అక్క‌డ ప‌న్ను లేదు. కాబ‌ట్టే అక్క‌డ బంగారం ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయి.

ఇక భార‌త్ తో పోలిస్తే దుబాయ్‌లో క‌నీసం 14 నుంచి 20 శాతం మేర బంగారం ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉంటాయి. క‌నుక‌నే కొంద‌రు అక్క‌డ బంగారం కొని అక్ర‌మ మార్గంలో ఇండియాకు త‌ర‌లిస్తుంటారు. ఆ క్ర‌మంలో కొంద‌రు ప‌ట్టుబ‌డుతుంటారు కూడా. అయితే మ‌న దేశం వారు ఎవ‌రైనా స‌రే పురుషులు అయితే 20 గ్రాముల బంగారం, స్త్రీలు అయితే 40 గ్రాముల బంగారాన్ని దుబాయ్‌లో కొని తేవ‌చ్చు. అంత‌క‌న్నా ఎక్కువ తెస్తే మాత్రం.. 12.5 శాతం వ‌ర‌కు ప‌న్ను చెల్లించాలి. ఈ ప‌న్ను చెల్లించాల‌ని చెప్పే కొంద‌రు బంగారాన్ని దుబాయ్ నుంచి ఇండియాకు స్మ‌గ్లింగ్ చేస్తారు

అయితే పురుషులు 20 గ్రాములు, స్త్రీలు 40 గ్రాముల క‌న్నా ఎక్కువ బంగారం కొని తెస్తే మాత్రం.. ఎక్కువ‌గా ఉన్నా బంగారానికి ప‌న్ను చెల్లించి తీసుకెళ్ల‌వ‌చ్చు. అయితే ఇలా ప‌న్ను చెల్లించి తీసుకెళ్లే బంగారంపై లిమిట్ ఏమీ లేదు. ఎంతైనా కొని తేవ‌చ్చు. కానీ ప‌న్ను అయితే త‌ప్ప‌క చెల్లించాలి. లేదంటే స్మ‌గ్లింగ్ చేసిన‌ట్లు అవుతుంది

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.