ఎంటర్టైన్‌మెంట్

కనీసంలో కనీసం ఆ పనైనా చేయండి!..

యాంకర్ రష్మీ నెట్టింట్లో తన మంచితనంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంటూ ఉంటోంది. రష్మీ తెరపై చూడటానికి ఒకలా.. తెర వెనుక ఇంకోలా ఉంటుంది. తెరపై ఉన్నంత యాక్టివ్‌గా, గ్లామర్‌గా బయట ఉండేందుకు ఇష్టపడదు. ఒక్క సారి కెమెరా పక్కకు వస్తే.. ఆమెదంతా కూడా వింత ధోరణి. మూగ జీవాల కోసం కష్టపడుతుంటుంది. పెట్స్ అంటూ వాటి కోసమే పరితపిస్తుంటుంది. వీధుల్లో తిరిగే కుక్కల కోసం కూడా రష్మీ ఎంతగానో ఆలోచిస్తుంటుంది. బర్రెలు, గేదెలు, ఆవులు ఇలా ప్రతీ ఒక్క జంతువు గురించి రష్మీ ఆలోచిస్తుంటుంది. చర్మంతో తయారు చేసే ఉత్పత్తులు, పాల పదార్థాలను వినియోగించొద్దంటూ అందరికీ అవగాహన కల్పిస్తుంటుంది. వాటి కోసం కొన్ని పరిశ్రమలు..

జంతువులను ఎలా హింసిస్తాయో చూపిస్తుంటుంది. మన ఆనందాల కోసం వాటిని ఎలా వాడుకుంటున్నామో చూపిస్తూ కొందరిలో కొందరినైనా మేల్కొల్పాలని ఆలోచిస్తుంటుంది యాంకర్ రష్మీ. ఇక పెట్స్ కోసం అయితే ఎక్కువగా పోస్టులు వేస్తుంది.వీధుల్లో పెట్స్‌కు గాయాలైనా కూడా రష్మీ తట్టుకోలేదు. వాటిని ఆస్పత్రిలో జాయిన్ చేస్తుంటుంది. ఎక్కడ ఏ పెట్‌కు ఏం జరిగినా కాపాడేందుకు ప్రయత్నిస్తుంటుంది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఓ పెట్‌ను రష్మీ తెచ్చిపెంచుకోసాగింది. చుట్కీ అనే పెట్ రష్మీకి అలా దొరికిందే. ఇక బయట షాపుల్లో పెట్స్‌ను కొనొద్దని, బయటి నుంచి దత్తత తీసుకోండని రష్మీ అందరినీ వేడుకుంటూ ఉంటుంది.

ఇక తాజాగా ఆమె ఓ పెట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. యాంకర్ రష్మీ ఎమోషనల్..అసలే ఇది వర్షా కాలం..రోడ్డు కనిపించదు.. వర్షానికి కుక్కలకు ఎక్కడ ఉండాలో తెలీదు.. కొన్ని సార్లు ప్రమాదంలో అవిచనిపోతుంటాయి. తాజాగా అలా ఓ పెట్ చనిపోయింది. దానిపై ఓ వీడియోను వదిలారు. మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.. మీలానే మాది కూడా ఫ్యామిలీనే అంటూ కుక్కలు బాధపడుతున్నట్టుగా వీడియోలో ఉంది. దీనిపై రష్మీస్పందించింది. మనం కనీసంలో కనీసం డ్రైవింగ్ అయినా సరిగ్గా చేద్దాం.. ఇలా పెట్స్‌ను డ్రైవింగ్‌తో చంపకండి అని రష్మీ వేడుకుంది.

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.