ఎంటర్టైన్‌మెంట్టాలీవుడ్‌

క్షత్రియ సంప్రదాయ పద్దతిలో ముగిసిన కృష్ణంరాజు గారి అంత్యక్రియలు

అనారోగ్య సమస్యలతో హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కృష్ణంరాజు గారు మరణించారు. కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు కోసం తీసుకువెళ్లారు. ఇక మధ్యాహ్నం గం. 3:30 సమయంలో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు ముగిసాయి. క్షత్రియ సంప్రదాయ పద్దతిలో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరగా

కృష్ణంరాజు గారి పార్ధివదేహాన్ని అంతిమయాత్రగా జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంటి వద్ద నుంచి మొయినాబాద్ మండలం కనకమామిడిలోని ఫామ్ హౌస్ లో అంత్యక్రియలు కోసం తీసుకువెళ్లారు. అంతిమయాత్రలో కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు కూడా భారీగా తరలి వచ్చారు. ఇక మధ్యాహ్నం గం. 3:30 సమయంలో అధికారిక లాంఛనాలతో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు ముగిసాయి.

క్షత్రియ సంప్రదాయ పద్దతిలో కృష్ణంరాజు గారి అంత్యక్రియలు జరగా.. ప్రభాస్ అన్న ప్రభోద్ తలకొరివి పెట్టడంతో ముగిశాయి. అయన ఇక మన మధ్య ఉండరు అనే వేదనతో కుటుంబ సభ్యుల బోరున విలపిస్తూ ఆయనకి వీడుకోలు పలికారు. కృష్ణంరాజు గారికి తుది వీడుకోలు పలికేందుకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు కూడా అంత్యక్రియలు హాజరయ్యారు.

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.