ఎంటర్టైన్‌మెంట్టాలీవుడ్‌

పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 8 మంది హీరోయిన్ల కెరియర్ ఆగిపోయిందా..?

సుప్రియ యార్లగడ్డ :

ఈ అమ్మడు పవన్ కళ్యాణ్ తో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అనే చిత్రంలో కథానాయికగా చేసింది. ఈ ఒక్క సినిమా చేసిన ఈమె మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు.

దేవయాని :

సుస్వాగతం సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించిన ఈమె 2,3 సినిమాలకే పరిమితమై తన కెరీర్ ను ముగించింది.

ప్రీతి జింగానియా:

తమ్ముడు సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈమె నరసింహనాయుడు, అధిపతి వంటి సినిమాల్లో చేసి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది.

కీర్తి రెడ్డి :

పవన్ తొలిప్రేమ సినిమాలో నటించిన ఈమె అర్జున్ సినిమాలో మహేష్ కు అక్క పాత్రలో నటించి ఆ తర్వాత తెలుగులో నటించలేదు.

రేణు దేశాయ్ :

పవన్ తో జానీ, బద్రి సినిమాల్లో చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత సినిమాలో కనిపించలేదు.

నేహా ఒబెరాయ్:

బాలు సినిమాలో పవన్ కు జోడిగా నటించిన ఈమె, ఆ తర్వాత ఒక్క సినిమాలో కూడా మళ్లీ కనిపించలేదు.

మీరా చోప్రా :

పవన్ బంగారం సినిమాలో నటించిన ఈ కథానాయిక తర్వాత ఒకటి రెండు సినిమాలు చేసి మాయమైంది.

అంజలి లావానియా :

పవన్ కళ్యాణ్ చేసిన పంజా సినిమా ద్వారా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత సినిమాల్లో నటించలేదు.

What's your reaction?

Leave A Reply

Your email address will not be published.